వాళ్లిద్దరు విడిపోయారటగా..!

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడి గురించి అందరికి తెలిసిందే. తెలుగులో దర్శకుడిగా సక్సెస్ అందుకోలేని అతను బాలీవుడ్ లో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈమధ్యనే వచ్చిన జడ్జిమెంటల్ హై క్యా సినిమా సక్సెస్ అవడంతో ఇప్పుడు అతని మీద ఫోకస్ ఎక్కువైంది. ప్రకాశ్ కోవెలమూడి భార్య కనిక థిల్లాన్ ఇద్దరు విడిపోయారట.. 2014 లో ఒక్కటైన ఈ జంట రెండేళ్ల క్రితమే విడిపోయినట్టు తెలుస్తుంది.  

ఈ విషయాన్ని ప్రకాశ్ కూడా ఒప్పుకోవడం విశేషం. అయినా సరే ప్రకాశ్ డైరెక్ట్ చేసిన సినిమాలకు కనిక కథలను అందిస్తున్నారు. జడ్జిమెంటల్ హై క్యా సినిమాకు కనిక థ్రిల్లాన్ కథ అందించారు. భార్యాభర్తలుగా విడిపోయినా స్నేహితులుగా తాము ఎప్పటికి కలిసి ఉంటామని చెబుతున్నారు. అయితే వీరిద్దరు విడిపోడానికి కారణాలు ఏంటని ముంబై మీడియా ఆరా తీస్తుంది. కారణాలు ఏవైనా ప్రకాశ్, కనిక థ్రిల్లాన్ ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకున్నారన్నది మాత్రం నిజమని తెలుస్తుంది.