'వెంకీమామ' మేకింగ్ వీడియో.. మామా అల్లుళ్లు అదరగొట్టారు..!

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ వెంకీమామ. కె.ఎస్ రవింద్ర అలియాస్ బాబి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఓ పక్క శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే సర్ ప్రైజింగ్ గా ఈ సినిమా నుండి ఓ టీజర్ రిలీజ్ చేశారు. మేకింగ్ వీడియోలా అనిపించే ఈ టీజర్ వెంకీ, చైతు ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ఈరోజు వెంకీమామ దర్శకుడు బాబి బర్త్ డే సందర్భంగా ఈ టీజర్ రిలీజ్ చేశారు.   

ఈ టీజర్ లో వెంకీ, చైతు ఇద్దరు స్టైల్ గా నడుచుకుంటూ వస్తున్నారు.. వెనకాల తమన్ మ్యూజిక్ అదిరిపోయింది. ఇక సినిమా షూటింగ్ టైంలో వెంకటేష్, చైతన్య కామెడీ అలరించింది. మొత్తానికి దర్శకుడు బాబి తన పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ ను అలరించాడు. త్వరలో రిలీజ్ ఫిక్స్ చేసునోనున్న ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నాలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో దగ్గుబాటి సురేష్ బాబు ఈ సినిమా నిర్మిస్తున్నారు.