
ఛలో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అయిన భామ రష్మిక మందన్న. కన్నడలో కిరాక్ పార్టీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన ఈ అమ్మడు తెలుగులో ఛలో, గీతా గోవిందం సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈమధ్యనే వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమాలో నటించి మెప్పించిన రష్మిక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తుంది.
రావడానికి ఎన్నో ఆఫర్లు వస్తున్నా తన పాత్రకు ప్రాధాన్యత లేని సినిమాలు తాను చేయనని చెబుతుంది రష్మిక. గీతా గోవిందం తర్వాత తమిళంలో చాలా సినిమాల అవకాశాలు వచ్చాయని కాని వాటిలో హీరోయిన్ కేవలం పాటలకు మాత్రమే అన్నట్టుగా ఉందని.. అందుకే ఆ సినిమాలు చేయలేదని అంటుంది రష్మిక. కోలీవుడ్ లో రష్మిక మొదటి ప్రాజెక్ట్ కార్తి హీరోగా చేస్తుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తున్న రష్మిక చూస్తుంటే సౌత్ క్రేజీ హీరోయిన్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.