అల్లు అర్జున్ తో సుకుమార్.. లైన్ క్లియర్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బన్ని సుకుమార్ తో ఓ సినిమా లైన్ లో పెట్టాడు. అదే కాకుండా వేణు శ్రీరాం డైరక్షన్ లో ఐకాన్ సినిమాకు ఓకే చెప్పాడు. ఆ సినిమా టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు దర్శక నిర్మాతలు.

త్రివిక్రం సినిమా పూర్తి కాగానే సుకుమార్ తో సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని అనుకున్నారు. కాని సుక్కు చెప్పిన లైన్ బన్నికి నచ్చలేదని అందుకే ఈ సినిమా క్యాన్సిల్ అయ్యిందని అన్నారు. కాని అలాంటిదేమి జరుగలేదని తెలుస్తుంది. ఆల్రెడీ స్క్రిప్ట్ ఫైనల్ అయ్యిందట. అక్టోబర్ నుండి సుకుమార్, బన్ని సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారట. ఆర్య, ఆర్య 2 తర్వాత సుకుమార్ తో బన్ని చేసే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.