ఎన్టీఆర్, నానిలను బీట్ చేసిన నాగ్..!

స్టార్ మాలో వస్తున్న బిగ్ బాస్ సీజన్ 3కి పెద్ద ప్రేక్షకాదరణ లభించలేదు. నాగ్ యాంకరింగ్ కూడా సోసోగానే ఉంది. ఇంటి సభ్యులు రోజు గొడవ పడుతున్నారు.. సీజన్ 3 పెద్దగా వర్క్ అవుట్ కాలేదు అన్న వార్తలు చాలానే వినపడ్డాయి. కాని అసలు విషయం ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 3 మొదటి వారం మొదటి రెండు సీజన్ల కన్నా ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. టి.ఆర్.పి రేటింగ్స్ లో నాగార్జున ఎపిసోడ్ హయ్యెస్ట్ గా నిలిచింది.

ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేసినప్పుడు 16.2 టి.ఆర్.పి రేటింగ్ తెచ్చుకున్న బిగ్ బాస్ షో నాని హోస్ట్ గా చేసినప్పుడు అత్యధికంగా 15.1 మాత్రమే తెచ్చుకున్నాడు. కాని నాగార్జున రంగంలోకి దిగాక షో మీద మరింత ఆసక్తి పెరిగింది. నాగార్జున ఫస్ట్ ఎపిసోడ్ కు ఏకంగా 17.91 టి.ఆర్.పి రేటింగ్ వచ్చింది. ఎన్.టి.ఆర్ కన్నా నాగార్జున చేసిన ఎపిసోడ్ కు ఎక్కువ రేటింగ్ రావడం షాకింగ్ న్యూస్ గా మారింది. ఎన్.టి.ఆర్, నాని ఇద్దరిని బీట్ చేసి సీనియర్ స్టార్ గా తన సత్తా చాటాడు నాగార్జున.