
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ప్రతి ఏటా అట్టహాసంగా జరుపుతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ పరిశ్రమలకు చెందిన సినిమాలకు ఈ అవార్డులు ఇస్తారు. ఈసారి కూడా ఖతర్ లో సైమా అవార్డ్ ఉత్సవాలు జరుగనున్నాయి. ఆగష్టు 15, 16 తారీఖులలో ఈ అవార్డ్ వేడుక జరుగనుందని తెలుస్తుంది. ఈసారి ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి, మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అటెండ్ అవుతున్నారని తెలుస్తుంది.
సైమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా వీరి ఎంట్రీ కానుంది. ఆగష్టు 15న తెలుగు, కన్నడ సినిమాలకు సంబందించి అవార్డుల ప్రధానోత్సవం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి పాల్గొంటారని తెలుస్తుంది. ఇక ఆ తర్వాత రోజు అనగా ఆగష్టు 16న తమిళ, మళయాళ సినిమా అవార్డుల ప్రధానోత్సవం జరుగనుంది. ఆరోజున మోహన్ లాల్ గెస్ట్ గా వస్తారట. మొత్తానికి ఇద్దరు సూపర్ స్టార్స్ తో ఈసారి సైమా అవార్డుల వేడుక కలర్ఫుల్ కానుంది. మరి ఈసారి సైరా విజేతలు ఎవరు కానున్నారో చూడాలి.