రాజశేఖర్ కు ట్రాఫిక్ పోలీసులు షాక్..!

ట్రాఫిక్స్ రూల్స్ అతిక్రమించిన వారికి పోలీసులు జరిమానా విధించడం కామనే. అయితే టాలీవుడ్ యాక్షన్ హీరో రాజశేఖర్ కు ఏకంగా 18వేల చలానాలు వచ్చాయట. ఎన్నో చలానాలు వచ్చినా రాజశేఖర్ స్పందించలేదట. అయితే సెలబ్రిటీస్ కాబట్టి వాళ్లు పెట్టే ఇబ్బందిని ప్రకటిస్తే తిక్క కుదురుతుంది. అలానే రాజశేఖర్ 18000 రూపాయల చలానాలు కట్టాలని ప్రకటించారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.

పోలీసులు ఇచ్చిన షాక్ కు రాజశేఖర్ రెస్పాండ్ అయ్యారు. తాను మొత్తం చలానాలు క్లియర్ చేశానని వెళ్లడించారు. కొన్ని కారణాల వల్ల చలానాలు కట్టడం లేటయిందని పోలీసులు నన్ను ఇబ్బంది పెట్టడం వల్ల నేను చలానా కట్టడం జరిగిందని అంటున్నారు. అలా ఏం జరుగలేదని దేనికైనా టైం రావాలి కదా అందుకే ఇప్పుడు కట్టానని తన సన్నిహితులతో చెబుతున్నారట రాజశేఖర్. ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని పోలీసులు ఇలా ప్రకటించాడో లేదో అలా చలానాలు క్లియర్ చేసి ఇప్పుడు కవర్ చేసుకుంటున్నాడు రాజశేఖర్.