
వైఎస్సార్ బయోపిక్ గా వచ్చిన యాత్ర సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్నాడు మహి వి రాఘవ్. అంతకుముందు తీసిన పాఠశాల, ఆనందో బ్రహ్మ ఆయన టాలెంట్ చూపించినా యాత్రకు దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకునాడు మహి వి రాఘవ్. ఈమధ్య తన తర్వాత సినిమా యాత్ర 2 చేస్తానని ప్రకటించాడు. యాత్ర 2లో జగన్ సిఎం అయ్యే దాకా సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు. కాని ప్రస్తుతం మహి వి రాఘవ్ యాత్ర 2 సినిమా ప్రయత్నాన్ని ఆపేసినట్టు తెలుస్తుంది.
మహి వి రాఘవ్ కొత్త సినిమాకు సిండికేట్ అనే టైటిల్ ఫిక్స్ చేశాడట. యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా కథ డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. తన ప్రతి సినిమా ముందు బడ్జెట్, కాస్టింగ్, సినిమా ఎలా తీయాలన్న ఆలోచన ఉండేది కాని తన తర్వాత సినిమాతో ఎలాంటి కథ చెప్పాలని ఆలోచన చేస్తానని అన్నారు మహి వి రాఘవ్. మరి ఈ సిండికేట్ సినిమాలో ఎవరు హీరోగా చేస్తున్నారు.. సినిమాకు సంబందించిన మిగతా విషయాలు ఏంటన్నది త్వరలో తెలుస్తుంది.