
విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం అలియాస్ బుజ్జి డైరక్షన్ లో 2017లో వచ్చిన సినిమా గీతా గోవిందం. విజయ్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత విజయ్ నోటా సినిమా చేయగా అది ఫ్లాప్ అయ్యింది. మళ్లీ టాక్సీవాలాతో లైన్ లో పడ్డాడు. రీసెంట్ గా డియర్ కామ్రేడ్ సినిమాతో మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ.
ప్రస్తుతం క్రాంతి మాధవ్ డైరక్షన్ లో బ్రేకప్ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఆనంద్ అన్నామలైతో చేస్తున్న హీరో సినిమాకు బ్రేక్ పడ్డదని తెలుస్తుంది. ఇదిలాఉంటే మరోసారి పరశురాం డైరక్షన్ లో విజయ్ సినిమా చేస్తాడని ఫిల్మ్ నగర్ టాక్. గీతా గోవిందం తర్వాత అల్లు అర్జున్, మహేష్ లతో సినిమా చేయాలని ప్రయత్నించాడు పరశురాం.. కాని వాళ్లెవరు ఖాళీగా లేకపోవడంతో మళ్లీ విజయ్ తోనే మరో సినిమా చేస్తాడని అంటున్నారు. మరి గీతా గోవిందం కాంబినేషన్ లో సినిమా అంటే ఈసారి ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి.