మన్మథుడు 2 బడ్జెట్ ఎంతంటే..!

కింగ్ నాగార్జున హీరోగా రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా మన్మథుడు 2. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నాగార్జున ఈ సినిమా నిర్మించారు. మన్మథుడు సినిమా సీక్వల్ గా వస్తున్న ఈ మూవీ కేవలం టైటిల్ మాత్రమే సీక్వల్ అని ఆ సినిమా కథకు ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. ఇక ఈ సినిమాకు బడ్జెట్ గా 24 కోట్లు ఖర్చు పెట్టారట. ఇందులో నాగార్జున రెమ్యునరేషన్ లేదని తెలుస్తుంది.

అంటే ఈ లెక్కన మన్మథుడు 2 కోసం నాగ్ బాగానే ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. ఆగష్టు 9న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే చేస్తున్నట్టు తెలుస్తుంది. చిలసౌ సినిమాతో తన ప్రతిభ చాటుకున్న రాహుల్ రవింద్రన్ రెండో సినిమానే క్రేజీ ప్రాజెక్ట్ సొంతం చేసుకున్నాడు. మరి నాగార్జున అతని మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటాడో చూడాలి.