పూరి జనగణమన కోసం కె.జి.ఎఫ్ హీరో..!

ఇటీవల వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్. రామ్ కెరియర్ లో ఈ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. పూరి కొన్నాళ్ల క్రితం జనగణమన సినిమా సబ్జెక్ట్ రెడీ చేశాడని తెలిసిందే. మహేష్ తో ఆ సినిమా చేయాలని చూస్తున్నా కథ విన్న మహేష్ సైలెంట్ గా ఉన్నాడట. అందుకే ఈమధ్య మహేష్ మీద పూరి సెటైర్ కూడా వేశాడు. ఇదిలాఉంటే పూరి జనగణమన కన్నడ హీరోతో చేయాలని చూస్తున్నాడట.  

కె.జి.ఎఫ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యశ్ తో జనగణమన తీసే ఆలోచనలో ఉన్నాడట పూరి. కె.జి.ఎఫ్ తో తెలుగులో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు యశ్. ఆ సినిమా హిందిలో కూడా బాగా ఆడింది.. అందుకే యశ్ తోనే పూరి జనగణమన సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాను కూడా తెలుగు, తమిళ, కన్నడ, హింది భాషల్లో తెరకెక్కించాలని చూస్తున్నాడట. మరి పూరి యశ్ జనగణమన సినిమా చేస్తారా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం యశ్ కె.జి.ఎఫ్ చాప్టర్ 2లో నటిస్తున్నాడు.