
మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే హీరోలుగా 11 మందిదాకా వచ్చారు. అందులో నిహారిక, కళ్యాణ్ దేవ్ లతో పాటుగా త్వరలో రాబోతున్న వైష్ణవ్ తేజ్ కూడా ఇందులో ఉన్నాడు. ఇక ఇప్పుడు మరో యాక్టర్ అల్లు ఫ్యామిలీ నుండి వస్తున్నాడు. ఇన్నాళ్లు అల్లు అరవింద్ వారసులుగా అల్లు అర్జున్, శిరీష్ లు మాత్రమే హీరోలుగా వచ్చారు. కాని ఇప్పుడు అల్లు బాబి కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడట.
ఇన్నాళ్లు బిజినెస్ వ్యవహారాలను చూస్తున్న అల్లు బాబి సడెన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడట. అయితే బాబి చేయాలనుకుంటుంది హీరోగా మాత్రం కాదట. అల్లు బాబి తన వయసుకు తగిన పాత్రలు ఇవ్వండంటూ దర్శక నిర్మాతలకు చెబుతున్నాడట. అల్లు బాబి సినిమాల్లోకి రావాలనుకోవడం అరవింద్ కు పెద్దగా ఇష్టం లేదట. ఈమధ్యనే రెండో పెళ్లితో షాక్ ఇచ్చిన అల్లు బాబి ఇప్పుడు సినిమాల్లోకి వచ్చి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. మరి అల్లు ఫ్యామిలీ నుండి వస్తున్న ఈ యాక్టర్ ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటాడో చూడాలి.