ఇస్మార్ట్ శంకర్ కుమ్మేస్తున్నాడు

పూరి జగన్నాథ్ డైరక్షన్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా జూలై 19న రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈమధ్య తెలుగులో క్లాస్ సినిమాలు ఎక్కువవుతున్న కారణంగా పక్కా మాస్ మసాలా మూవీగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఆడియెన్స్ ను థ్రిల్ చేసింది. పెర్ఫెక్ట్ పూరి మార్క్ మూవీగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైంది.   

టెంపర్ నుండి హిట్టు కోసం తపిస్తున్న పూరి తాను హిట్టు కొడితే ఎలా ఉంటుందో మరోసారి ఇస్మార్ట్ శంకర్ తో చూపించాడు. రిలీజై 12 రోజులవుతుండగా 12 రోజుల్లో ఈ సినిమా 31.80 కోట్లను కలెక్ట్ చేసింది. సినిమా కొన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ లాభాలు తెచ్చుకున్నారు. ఏరియా వైజ్ ఇస్మార్ట్ శంకర్ 12 రోజుల కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తే..

నైజాం : 12.55 కోట్లు 

సీడెడ్ : 5 కోట్లు

ఉత్తరాంధ్ర : 3.48 కోట్లు

ఈస్ట్ : 1.83 కోట్లు

వెస్ట్ : 1.53 కోట్లు

కృష్ణా : 1.82 కోట్లు

గుంటూరు : 1.82 కోట్లు

నెల్లూరు : 0.96 కోట్లు

ఏపి/తెలంగణ : 28.99 కోట్లు 

రెస్ట్ ఆఫ్ ఇండియా : 1.80 కోట్లు

ఓవర్సీస్ : 1 కోటి

వరల్డ్ వైడ్ :31.79 కోట్లు