
బిగ్ బాస్ సీజన్ 3లో స్టార్ కంటెస్టంట్ అంటే శ్రీముఖి అని చెప్పొచ్చు. యాంకర్ గా బుల్లితెరను ఓ ఊపు ఊపేస్తున్న ఈ అమ్మడు బిగ్ బాస్ షోకి రావడం ఓ సర్ ప్రైజ్. ముందు రెండు సీజన్లకు శ్రీముఖిని అడిగారట కాని ఆమె అప్పుడు సారీ అని చెప్పేసింది. కాని ఈసారి మాత్రం శ్రీముఖిని ఒప్పించి మరి కంటెస్టంట్ గా తీసుకొచ్చారు. అయితే శ్రీముఖికి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ ఇచ్చి హౌజ్ లోకి తెచ్చినట్టు టాక్.
తెలుస్తున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ హౌజ్ లో రోజుకి 3.5 లక్షల రెమ్యునరేషన్ తో శ్రీముఖి బిగ్ బాస్ లోకి వెళ్లిందట. ఇంటి సభ్యులలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ ఆమెకే అని తెలుస్తుంది. ఒకవేళ 100 రోజులు శ్రీముఖి బిగ్ బాస్ హౌజ్ లో ఉంటే 3.5 కోట్లు రెమ్యునరేషన్ గా ఇవ్వాల్సిందే. ఒకవేళ అదే నిజమైతే హీరోయిన్స్ కన్నా శ్రీముఖి క్రేజ్ ఎక్కువని ఒప్పుకోవాల్సిందే.