రిలీజ్ డేట్ కు ట్రైలర్ వస్తుందట

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న క్రేజీ మూవీ సాహో. సుజిత్ డైరక్షన్ లో యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపుగా 300 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తుంది. ఆగష్టు 15న రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన చిత్రయూనిట్ వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కంప్లీట్ అవడం లేదని ఆగష్టు 30కి సినిమా వాయిదా వేశారు. ఆగష్టు 15న సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారట. అంటే రిలీజ్ అనుకున్న డేట్ కు ట్రైలర్ వస్తుందన్నమాట.

ఇప్పటికే సినిమా నుండి వచ్చిన టీజర్ అంచనాలు పెంచగా ట్రైలర్ తో మరింత అంచనాలను పెంచాలని చూస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా యాక్షన్ ఎంటర్టైనర్ గా సాహో వస్తుంది. శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగు, తమిళ, హింది భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్న సాహో బాహుబలి రేంజ్ రికార్డులు బద్ధలు కొట్టడం ఖాయమని చిత్రయూనిట్ చెబుతున్నారు. మరి అది ఎంతవరకు సాధ్యమో తెలియాలంటే ఆగష్టు 30 వరకు వెయిట్ చేయాల్సిందే.