కాజల్ కే ఆ లక్కీ ఛాన్స్

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా సైరా నరసింహా రెడ్డి చేస్తున్నారు. ఆ సినిమా పూర్తికాగానే కొరటాల శివ మూవీ మొదలు పెట్టనున్నారు. ఈ సినిమా కూడా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో వస్తుందని తెలుస్తుంది. మిర్చి నుండి భరత్ అనే నేను వరకు వరుస సూపర్ హిట్లతో దూసుకెళ్తున్నాడు కొరటాల శివ. చిరుతో కూడా ఓ సోషల్ మెసేజ్ స్టోరీ రాశాడట. సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తారని తెలుస్తుంది. 

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు నయనతారని అనుకున్నారు. ఆల్రెడీ ఆమె ప్రస్తుతం చిరు చేస్తున్న సైరా నరసింహా రెడ్డిలో నటిస్తుంది. కోలీవుడ్ లో డేట్స్ అడ్జెస్ట్ కావడం లేదని కొరటాల శివ, చిరు సినిమాకు నో చెప్పిందట నయనతార. ఆమె కాకుండా అనుష్క, పాయల్, శ్రద్ధ శ్రీనాథ్ వంటి హీరోయిన్స్ ను చూశారు కాని వీళ్ల కన్నా కాజల్ బెటర్ అని మళ్లీ కాజల్ కే ఫిక్స్ అయ్యారట. ఖైది నంబర్ 150లో చిరు కు జోడీగా నటించిన కాజల్ ఆ సినిమాతో మళ్లీ క్రేజ్ తెచ్చుకుంది. అందుకే కాజల్ తోనే చిరు మరోసారి జతకడుతున్నట్టు తెలుస్తుంది.