లండన్ రాయల్ ఆల్బర్ట్స్ థియేటర్ లో బాహుబలి ప్రదర్శన

రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ఇప్పటికే ఎన్నో అవార్డులు రివార్డులు అందుకోగా దేశ విదేశాల్లో కూడా ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. ఇక ఇప్పుడు మరో క్రేజీ రికార్డ్ సొంతం చేసుకుంటుంది బాహుబలి మూవీ. అదేంటి అంటే లండన్ లోని రాయల్ ఆల్బర్ట్స్ హాల్ లో ఈ చిత్రం ప్రదర్శించబడుతుంది. సాధారణంగా అక్కడ ఆస్కార్ ఫిల్మ్స్, క్రేజీ హాలీవుడ్ మూవీస్ ప్రదర్శన చేస్తారు. ఇప్పుడు ఆ ఛాన్స్ బాహుబలి సినిమకు వచ్చింది.   

రాయల్ ఆల్బర్ట్స్ హాల్ లో బాహుబలి సినిమాను బ్రిటన్ కు చెందిన ప్రముఖ దిగ్గజాలు ఈ సినిమాను చూస్తారట. అంతేకాదు ప్రదర్శనకు ముందు దర్శకుడు రాజమౌళితో చిట్ చాట్ కూడా ఉంటుందని తెలుస్తుంది. ఈ స్పెషల్ ఈవెంట్ కు రాజమౌళితో పాటుగా ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా కూడా అటెండ్ అవుతారని తెలుస్తుంది. బాహుబలి 1, 2 సినిమాలు ఇప్పటికి రికార్డులు సృష్టించడం తెలుగు ఆడియెన్స్ ఎక్సైట్ అవుతున్నారు.