నాని గ్యాంగ్ లీడర్ స్టోరీ లీక్

నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రం కె కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా గ్యాంగ్ లీడర్. నానితో పాటుగా ఈ సినిమాలో ఐదుగురు లేడీస్ నటిస్తున్నారు. సీనియర్ నటి లక్ష్మి, శరణ్య, హీరోయిన్ గా ప్రియాంకా అరుల్ మోహన్ మరో ఇద్దరు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ ఐదుగురు ఆడవాళ్లతో నాని ఏం చేశాడు అన్నది సినిమా కథ. అయితే రీసెంట్ గా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. టీజర్ లో హీరో ఓ రివెంజ్ రైటర్ గా కనిపించాడు.

ఆ రైటర్ సహాయంతో ఈ లేడీ గ్యాంగ్ ఏం చేసింది అన్నది సినిమా కథ. అయితే సినిమాలో ఈ ఆరుగురు ఆడవాళ్లు కలిసి బ్యాంక్ రాబరీకి ప్లాన్ చేస్తాడట. దానికి నాని గ్యాంగ్ లీడర్ గా స్కెచ్ వేస్తాడని తెలుస్తుంది. మొత్తానికి గ్యాంగ్ లీడర్ తో నాని థ్రిల్లింగ్ స్టోరీతో వస్తున్నాడు. ఈ సినిమాలో విలన్ గా కార్తికేయ నటించడం విశేషం. ఆగష్టు 15న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాతో నాని మరో సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.