డియర్ కామ్రేడ్ కు 13 నిమిషాల కోత..!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా భరత్ కమ్మ డైరక్షన్ లో వచ్చిన సినిమా డియర్ కామ్రేడ్. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ కలిసి నిర్మించిన ఈ మూవీ జూలై 26న రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో రిలీజైన ఈ సినిమాకు ఒక్క తెలుగులో తప్ప అన్నిచోట్ల పాజిటివ్ టాక్ రాలేదు. తెలుగులో కూడా లెంగ్త్ ఎక్కువవడం, స్లో నరేషన్ అన్న టాక్ వచ్చింది.

అయితే ఆదివారం జరిగిన థ్యాంక్స్ మీట్ లో సినిమా స్లోగా ఉన్నా అది అలానే చెప్పాలని అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. కాని ఈ స్లో స్క్రీన్ ప్లే సినిమా రిజల్ట్ మీద దెబ్బేస్తుందని భావించి సెకండ్ హాఫ్ లో 13 నిమిషాల సీన్ ఎత్తేసినట్టు తెలుస్తుంది. డియర్ కామ్రేడ్ 2 గంటల 50 నిమిషాల రన్ టైం తో రిలీజైంది. సినిమా ఆడియెన్స్ కు ఎంగేజ్ అయినా అక్కడక్క స్లో అవడం వల్ల బోర్ కొట్టేసింది.

అందుకే సెకండ్ హాఫ్ లో అనవసరమైన సీన్స్ కు కత్తెరవేశారు. నిన్న సాయంత్రం నుండే ఈ ఎడిటెడ్ వర్షన్ ఆడుతుందట. మొత్తానికి విజయ్ దేవరకొండకు నచ్చినా నచ్చకున్నా నిర్మాతల బలవంతం మీద డియర్ కామ్రేడ్ కు కత్తెర వేయాల్సి వచ్చింది. మరి ఈ ఎడిటెడ్ వర్షన్ ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో చూడాలి.