వైష్ణవ్ తేజ్ సినిమా నుండి అతను బయటకొచ్చాడా..!

మెగా ఫ్యామిలీ నుండి రాబోతున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన బుచ్చిబాబు డైరక్టర్ గా చేస్తున్న ఈ సినిమాకు ఉప్పెన అనే టైటిల్ పరిశీలణలో ఉంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడని తెలిసిందే. హీరోయిన్ తండ్రిగా విజయ్ సేతుపతి నటిస్తున్నాడట. 

అయితే ఏమైందో ఏమో కాని ఈ ప్రాజెక్ట్ నుండి విజయ్ సేతుపతి ఎగ్జిట్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. కథ ఒకలా చెప్పిన దర్శకుడు ఇప్పుడు వేరేలా తీస్తుండటం వల్ల సినిమా నుండి విజయ్ సేతుపతి బయటకు వచ్చినట్టు ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఓపెనింగ్ రోజు ఒకర్ని అనుకోగా ఇప్పుడు ఆమెను తప్పించి మరొకరిని సెలెక్ట్ చేశారు. స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్.. ఇప్పుడు యువ హీరోలతో వరుస సినిమాలు చేస్తున్నారు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ మూవీ కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వచ్చింది. .