
ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో యశ్ హీరోగా వచ్చిన కె.జి.ఎఫ్ చాప్టర్ 1 సెన్సేషనల్ హిట్ అందుకుంది. కన్నడ సినిమానే అయినా తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. చాప్టర్ 1 సూపర్ హిట్ అవడంతో కె.జి.ఎఫ్ చాప్టర్ 2 మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మొదటి పార్ట్ కు కొనసాగింపుగా కె.జి.ఎఫ్ చాప్టర్ 2 రానుంది. ఈ పార్ట్ లో సంజయ్ దత్ కూడా నటిస్తున్నాడని తెలిసిందే.
జూలై 29 సంజయ్ దత్ బర్త్ డే సందర్భంగా కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సంజయ్ దత్ పోశిస్తున్న అధీర లుక్ రివీల్ చేశారు. రఫ్ లుక్ లో సంజయ్ దత్ విలన్ గా అదరగొట్టేయడం ఖాయమని ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తేనే తెలుస్తుంది. కె.జి.ఎఫ్ చాప్టర్ 1లోనే సంజయ్ దత్ నటించాల్సి ఉంది కాని ప్రశాంత్ నీల్ పై ముందు నమ్మకం లేక ఆ ఛాన్స్ వదులుకున్నాడు సంజయ్ దత్. కె.జి.ఎఫ్ సక్సెస్ చూశాక సీక్వల్ కు ఓకే చెప్పాడు. సంజయ్ ఫస్ట్ లుక్ సినిమాపై మరింత అంచనాలు పెంచింది.