న్యూస్ ఛానెల్స్ ఆటలు కట్టించే బిగ్ బాస్ స్కెచ్..!

బిగ్ బాస్ సీజన్ 3 వారం రోజులు సక్సెస్ ఫుల్ గా పూర్తయింది. లాస్ట్ వీక్ నాగ్ కాస్త తడబడినట్టు అనిపించినా ఈ శని, ఆదివారాల్లో నాగార్జున ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఆదివారం ఎపిసోడ్ కంటెస్టంట్స్ తో నాగార్జున ఆట పాటలు షోకి కొత్త ఉత్సాహాన్ని తెచ్చాయి. మొదటి వారం ఆరుగురు సభ్యులు నామినేట్ అవగా ఫైనల్ గా హేమ ఫస్ట్ ఎలిమినేట్ అయ్యింది. హేమ చేసిన అతికి ఆడియెన్స్ సరైన సమాధానం చెప్పారు.

బిగ్ బాస్ షో మీద ఉన్న క్రేజ్ తో ఎలిమినేట్ అయిన సభ్యులను న్యూస్ ఛానెల్స్ ఎటాక్ చేస్తాయి. రోజుకి 24 గంటలు ఉంటే కేవలం ఒక గంట మాత్రమే షోలో చూపిస్తారు అది చూసే ఆడియెన్స్ ఓట్లు వేస్తారు. మరి మిగిలిన 23 గంటల రష్ బయటకు రాదు. అందుకే న్యూస్ ఛానెల్స్ ఆఫ్ ద రికార్డ్ ఏం జరుగుతుంది అన్న విషయాలను బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తారు. బిగ్ బాస్ పై అనవసరమైన ఈ చర్చలు న్యూస్ ఛానెల్స్ కు టి.ఆర్.పి రేటింగ్ తెస్తున్నా షో క్రెడిబిలిటీ దెబ్బ తీస్తున్నాయి. 

అందుకే ఈసారి బిగ్ బాస్ కంటెస్టంట్స్ కు సెపరేట్ రూల్స్ పెట్టారు. బిగ్ బాస్ షో నుండి ఎలిమినేట్ అయితే ముందు స్టార్ మాకి ఇంటర్వ్యూ ఇచ్చాకనే ఇంకెక్కడైనా ఇంటర్వ్యూస్ ఇచ్చేలా నిబంధన పెట్టారట. లాస్ట్ సీజన్ లో లాస్ట్ వీక్ వరకు ఉన్న తనీష్ ఈ సీజన్ ఎలిమినేటెడ్ కంటెస్టంట్స్ ను ఇంటర్వ్యూ చేస్తాడని తెలుస్తుంది. షోని వాడుకుని మిగతా ఛానెల్స్ కు ఛాన్స్ ఇవ్వకుండా స్టార్ మానే కంటెస్టంట్ క్రేజ్ ను వాడుకోవాలని చూస్తుంది.