
వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన రియాలిటీ షో బిగ్ బాస్. బాలీవుడ్ లో 12 సీజన్లు సక్సెస్ ఫుల్ గా కొనసాగించిన బిగ్ బాస్ ఈ 12 సీజన్లకు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. తెలుగులో మొదటి సీజన్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేయగా.. రెండో సీజన్ నాని హోస్ట్ గా చేశాడు. బిగ్ బాస్ మొదటి సీజన్ విషానికి వస్తే.. హోస్ట్ గా స్టార్ హీరో ఎన్.టి.ఆర్ చేయడంతో షోకి ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. అంతేకాదు షోకి భారీ రెస్పాన్స్ వచ్చింది.
ముఖ్యంగా ఓటింగ్ టైంలో ఆడియెన్స్ అంతా బాగా సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇక సీజన్ 2లో కూడా బుల్లితెర ఆడియెన్స్ ఓటింగ్ లో యాక్టివ్ గా పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే సీజన్ 3 అట్టహాసంగా మొదలవగా బిగ్ బాస్ అనగానే ఆడియెన్స్ లో నెగటివ్ ఫీలింగ్ వచ్చింది. ఇక ఈసారి కంటెస్టంట్స్ కూడా మొదటి రోజు నుండే గొడవ పడటంతో కాస్త కూస్తో ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది. అందుకే ఈ వారం ఓటింగ్ శాతం చాలా దారుణంగా ఉందని తెలుస్తుంది. ఈ వారం సేఫ్ అయిన హిమజకి 35 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయట. ఆ తర్వాత రాహుల్ కు 25 శాతం ఓట్లు పడ్డాయట. పునర్నవి, జాఫర్ లకు తర్వాత పొజిషన్ వచ్చిందట. శనివారం ఎపిసోడ్ లో హిమజని, పునర్నవిలను సేఫ్ చేశాడు నాగార్జున.
ఇంకా హేమ, రాహుల్, వితిక, జాఫర్ లు నామినేషన్ లో ఉన్నారు. మొదటి ఎలిమినేటర్ రవన్నది ఆదివారం తెలుస్తుంది. హోస్ట్ గా నాగార్జున కూడా సోసోగానే అనిపిస్తున్నారు. హోస్ట్ గా వచ్చామా చేశామా వెళ్లామా అన్నట్టుగా నాగ్ వ్యవహారం కనిపిస్తుంది. మరి రానున్న రోజుల్లో అయినా బిగ్ బాస్ ఇంట్రెస్ట్ కలిగించేలా చేస్తుందో లేదో చూడాలి.