మహేష్ న్యూ బిజినెస్ ఐడియా

సూపర్ స్టార్ మహేష్ హీరోగా సినిమాలు చేస్తున్నా సరే ఓ పక్క వాణిజ్య ప్రకటనలతో కూడా తన సత్తా చాటుతున్నాడు. ఈమధ్య ఏ.ఎం.బి సినిమాస్ తో డైరెక్ట్ బిజినెస్ లోకి దిగిన మహేష్ ఇప్పుడు మరో బిజినెస్ ప్లాన్ లో ఉన్నాడని తెలుస్తుంది. రీసెంట్ గా స్టార్ క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ సొంతంగా రౌడీ బ్రాండ్ క్లాతింగ్ బిజినెస్ మొదలు పెట్టాడు. ప్రస్తుతానికి జెంట్స్ వరకే అవైలబుల్ ఉన్న రౌడీ క్లాత్ బిజినెస్ రానున్నరోజుల్లో అన్ని వయసుల వారికి తగిన దుస్తులను అందచేస్తారట.

ఇప్పుడు మహేష్ కూడా సొంత క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేస్తాడని తెలుస్తుంది. దీనికి సంబందించిన వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యిందట. అంతేకాదు మహేష్ ఈకామర్స్ బిజినెస్ లోకి వచ్చే ఆలోచనలో ఉన్నాడట మహేష్ . దానిలో తన కొత్త బ్రాండ్ తో పాటుగా మిగతా బ్రాండ్లను కూడా ప్రమోట్ చేస్తారట. ఈ బిజినెస్ వ్యవహారాలన్ని నమ్రత దగ్గర ఉండి చూసుకుంటుందని తెలుస్తుంది. బిజినెస్ లో మహేష్ కు ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.