ఫిల్మ్ చాంబర్ ఎన్నికలు.. సి.కళ్యాణ్ ప్యానెల్ గెలుపు..!

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్స్ ముగిశాయి.. ఈసారి ఎన్నికల్లో సి కళ్యాణ్ అధ్యక్షతన పోటీలో దిగిన 'మన ప్యానెల్' గెలుపొందింది. దిల్ రాజు యాక్టివ్ ప్యానెల్ పై సి కళ్యాణ్ మన ప్యానెల్ ఘన విజయం సాధించింది. 20 మంది సెక్టార్ మెంబర్స్ లో 16 మంది మన ప్యానెల్ సభ్యులు గెలిచారు.. నలుగురు మాత్రమే యాక్టివ్ ప్యానెల్ నుండి గెలిచారు. 12 మంది ఈసీ సభ్యుల్ని ఎన్నుకోవాల్సి ఉండగా అందులో కూడా 9 మంది సి కళ్యాణ్ మన ప్యానెల్ సభ్యులే గెలవడం జరిగింది. దిల్ రాజు యాక్టివ్ ప్యానెల్ నుండి ఇద్దరు మాత్రమే విజయం సాధించారు. అందులో దిల్ రాజు, దామోదర ప్రసాద్ మాత్రమే ఉన్నారు. నిర్మాత మోహన్ గౌడ్ ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు.            

ఈ ఎన్నికల్లో చిన్న నిర్మాతల సపోర్ట్ తో సి. కళ్యాణ్ అద్భుత విజయాన్ని అందుకున్నారు. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో 1438 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ జరుగుతున్న టైంలో నిర్మాతల మధ్య చిన్నపాటి వాగ్వివాదం జరిగింది. ఇరు ప్యానెళ్ల సభ్యులు వాధించుకోవడం వల్ల కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.