
నాగార్జున హోస్ట్ గా స్టార్ మాలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 3 జూలై 21న మొదలైంది. లాస్ట్ సండే కంటెస్టంట్స్ ను ఇంట్లోకి పంపించిన నాగార్జున ఈరోజు ఒకరిని ఎలిమినేట్ చేయాల్సి ఉంది. ఈ వారం నామినేషన్ లో ఆరుగురు ఇంటి సభ్యులు ఉన్నారు. హేమ, రాహుల్, హిమజ, జాఫర్, వితిక, పునర్నవిలో ఎవరో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది. ఈరోజు నాగార్జున వచ్చి ఈ వారం హౌజ్ మెట్స్ మధ్య జరిగిన విషయాలను ప్రస్తావిస్తూ నామినేషన్ లో ఉన్న ముగ్గురిని సేఫ్ చేశాడు.
ఇక మిగిలిన ముగ్గురిలో ఒకరిని రేపు అంటే ఆదివారం ఎలిమినేట్ చేస్తారు. మొదటి ఎపిసోడ్ లో కంటెస్టంట్స్ ను కేవలం పరిచయం చేయడం హౌజ్ లోకి పంపించిన నాగ్ ఈ ఎపిసోడ్ లో ఆకట్టుకుంటాడని ఆశిస్తున్నారు. ఇక ఈ వారం నామినేషన్ లో ఉన్న ఆరుగురిలో జాఫర్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. ఓటింగ్ లో నామినేషన్స్ లో ఉన్న హిమజకు ఎక్కువ ఓటింగ్స్ కు వచ్చాయట.. ఆ తర్వాత హేమ, రాహుల్, పునర్నవి, వితిక ఉన్నారట. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరో 4 గంటలు వెయిట్ చేస్తే చాలు.