
ఎన్.టి.ఆర్ బయోపిక్ తర్వాత బాలకృష్ణ కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో మూవీ చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ కాంబినేషన్ లో ఇంతకుముందు జై సింహా సినిమా వచ్చింది. మళ్లీ అదే కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నారు. ముహుర్త కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగష్టు రెండో వారం నుండి సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తుంది. బాలకృష్ణ డ్యుయల్ రోల్ చేస్తున్నఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని సమాచారం.
ఇక ఈ సినిమాలో శ్రీయ హీరోయిన్ గా నటిస్తుందని రీసెంట్ గా వార్తలు వచ్చాయి.. కాని ఆమె ప్లేస్ లో సోనాల్ చౌహన్ ఫైనల్ అయ్యిందట. ఇక సినిమాలో సెకండ్ హీరోయిన్ గా భూమిక చావ్లా సెలెక్ట్ అయ్యిందని తెలుస్తుంది. తెలుగులో మహేష్, ఎన్.టి.ఆర్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ తో నటించిన భూమిక కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చి మళ్లీ ఈమధ్య రీ ఎంట్రీ ఇచ్చింది. నాని ఎం.సి.ఏ, నాగ చైతన్య సవ్యసాచి సినిమాల్లో నటించిన భూమిక బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలు రూలర్ అనే టైటిల్ పరిశీలణలో ఉంది.