డియర్ కామ్రేడ్ స్లో అయ్యిందని ఒప్పుకున్న విజయ్ దేవరకొండ..!

విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ డైరక్షన్ లో వచ్చిన సినిమా డియర్ కామ్రేడ్. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ కలిసి నిర్మించిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. శుక్రవారం రిలీజైన ఈ సినిమా మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజు 11.40 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ కలెక్ట్ చేసింది డియర్ కామ్రేడ్.   

సినిమా సక్సెస్ అయినందుకు గాను చిత్రయూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈవెంట్ లో భాగంగా విజయ్ దేవరకొండ స్పీచ్ ఆడియెన్స్ ను మెప్పించింది. ఈ సినిమా గురించి చెప్పాలంటే మైండ్ లో చాలా గుర్తుకొస్తున్నాయి.. నిన్న నా జీవితంలో చాలా మరచిపోలేని రోజు.. ప్రమోట్ చేస్తున్న దగ్గర నుండి ఈ సినిమా చాలా స్పెషల్ మూవీ.. మా అందరికి ఇది పర్సనల్ ఫిల్మ్.. వన్ ఇయర్ నుండి మా ఎమోషన్స్ అన్ని ఈ సినిమాలో పెట్టి చేశాం అన్నారు విజయ్ దేవరకొండ. బాబి, లిల్లీ ల రిలేషన్, వారి కష్టాలు వాటిని దాటుకుని వచ్చి పోరాడటం ఇవన్ని సినిమాలోనే కాదు సినిమా చేస్తూ చేస్తూ తాను పర్సనల్ గా ఎమోషనల్ అవుతున్నా అంటూ చెప్పారు.      

లాస్ట్ వన్ వీక్ నుండి తమ్ముడు ఫంక్షన్ నుండి ఊరికే ఏడుస్తున్నా.. అందుకు తన స్నేహితులు ఊరికే ఏడుస్తున్నావ్ ఏంట్రా అని కూడా అంటున్నారు. ఇదంతా ఈ సినిమా వల్లే జరిగింది. ఈ సినిమా చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. కలక్షన్స్ బాగా వచ్చాయని అంటున్నారు. వాటి కన్నా తెలుగు, తమిళ, కన్నడ, మళయాళంలో ఇంతమంది జనం సినిమా చూశారన్నది ఎక్కువ ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు విజయ్. సినిమాను దర్శకుడు భరత్ కమ్మ వాళ్ల తండ్రికి అంకితం ఇచ్చారు. సినిమాలో మరో పిల్లర్ రష్మిక మందన్న కూడా ఈ సినిమాలో చాలా కష్టపడ్డదని అన్నారు విజయ్. వన్ ఇయర్ నుండి షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా యూనిట్ అందరిని తాను మిస్సవుతున్నా అంటూ మరోసారి ఎమోషనల్ స్పీచ్ తో ఇంప్రెస్ చేశాడు విజయ్ దేవరకొండ. ఇక సినిమా కొన్ని చోట్ల స్లోగా ఉందని అంటున్నారు. ఇది ఒక ఎమోషనల్ మూవీ కచ్చితంగా అందరికి నచ్చుతుందని అన్నారు విజయ్.