రంగస్థలం అలా మిస్సయ్యా..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో సూపర్ హిట్టైన సినిమా రంగస్థలం. నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసి రాం చరణ్ సరికొత్త సంచలనం సృష్టించాడు. చిట్టిబాబుగా చరణ్.. రామలక్ష్మి పాత్రలో సమంత ఇద్దరు అదరగొట్టారు. రంగస్థలం సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను అనుకున్నారట. స్క్రీన్ టెస్ట్ కూడా చేశారట. కాని ఆ సినిమా టైంకు తన డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వల్ల అనుపమ ఆ ఛాన్స్ మిస్ చేసుకుంది.

రంగస్థలం సినిమాలో ఛాన్స్ మిస్సైనందుకు ఇప్పటికి బాధపడుతున్నా అంటున్నారు అనుపమ పరమేశ్వరన్. అయితే ఆ సినిమాలో తన స్థానంలో నటించిన సమంతనే పర్ఫెక్ట్ గా అనిపించిందని. ఒకవేళ తాను నటించినా సమంతలా చేసేదాన్ని కాదని అంటుంది అనుపమ. త్రివిక్రం అఆతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ మళయాళ భామ యువ హీరోల సరసన నటిస్తుంది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న రాక్షసుడు సినిమాలో హీరోయిన్ గా నటించింది అనుపమ. కోలీవుడ్ లో సూపర్ హిట్టైన రాక్షసన్ సినిమా రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది.