డియర్ కామ్రేడ్ ను బాయ్ కాట్ చేస్తున్నారు

విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ డైరక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన సినిమా డియర్ కామ్రేడ్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో రిలీజ్ అయ్యింది. శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే కన్నడలో ఈ సినిమాను చూడకుండా బాయ్ కాట్ చేస్తున్నారు. కన్నడలో అక్కడ సినిమాల కన్నా డబ్బింగ్ సినిమాలు ముఖ్యంగా తెలుగు సినిమాల హవా ఎక్కువవుతుందని అక్కడ ప్రేక్షకులు నిరసన తెలుపుతున్నారు.

కన్నడలో డియర్ కామ్రేడ్ సినిమాను భారీగా రిలీజ్ చేయడంతో అక్కడ సినిమాలకు దెబ్బ పడుతున్నాయన్న కారణంతో డియర్ విజయ్, రష్మికలు జంటగా నటించిన ఈ సినిమాను చాలా చోట్ల బాయ్ కాట్ చేశారని తెలుస్తుంది. అంతేకాదు కన్నడ సోషల్ మీడియాలో కూడా డియర్ కామ్రేడ్ కు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారట. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా డియర్ కామ్రేడ్ కు కన్నడలో ఊహించని విధంగా షాక్ తగిలింది.