రకుల్ భారీగానే డిమాండ్ చేసిందా..!

తెలుగులో స్పైడర్ తర్వాత అవకాశాలేమి రావట్లేదని బాధపడ్డ రకుల్ ప్రీత్ సింగ్ కోలీవుడ్ లో దేవ్, ఎన్.జి.కె వంటి సినిమాలు చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ప్రస్తుతం ఏమాత్రం ఫాంలో లేని రకుల్ కు నాగార్జున పిలిచి మరి ఛాన్స్ ఇచ్చాడు. తన కెరియర్ లో సూపర్ హిట్ గా నిలిచిన మన్మథుడు సీక్వల్ మూవీ మన్మథుడు 2లో రకుల్ కు ఛాన్స్ ఇచ్చాడు నాగార్జున. వరుస సినిమాలు చేస్తూ మంచి జోష్ లో ఉన్న టైంలో కోటి దాకా రెమ్యునరేషన్ తీసుకున్న రకుల్ నాగ్ సినిమాకు కోటికి తక్కువగా తీసుకుని ఉంటుందని అనుకున్నారు.     

కాని మన్మథుడు 2 సినిమాకు కూడా రకుల్ కోటిన్నర దాకా చార్జ్ చేసిందని తెలుస్తుంది. అంత ఇచ్చారు కాబట్టే అమ్మడు సినిమాలో తెగ రెచ్చిపోయిందని ప్రచార చిత్రాలు చూస్తే అర్ధమవుతుంది. కథకు తగినట్టుగా నటించాల్సి వచ్చిందో లేక ఈ సినిమాతో మరిన్ని ఛాన్సులు తెచ్చుకోవాలని అనుకుందో కాని రకుల్ మాత్రం మన్మథుడు 2లో గ్లామర్ షో చేసింది. ఆగష్టు 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మన్మథుడు రేంజ్ హిట్ అవుతుందో లేదో చూడాలి.