RRR ఓవర్సీస్ డీల్ క్లోజ్..!

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమా 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. సినిమాలో అలియా భట్ ఒక హీరోయిన్ కాగా అమెరికన్ బ్యూటీ ఎమ్మా రాబర్ట్స్ మరో హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. 2020 జూలై 30 రిలీజ్ ఫిక్స్ చేసిన ఈ సినిమా అనుకున్న టైంకు రిలీజ్ చేసేలా షెడ్యూల్ వేశారు.  

సెట్స్ మీద ఉండగానే ఈ సినిమా బిజినెస్ భారీగా చేస్తుంది. ఓవర్సీస్ లో అన్ని భాషల్లో కలిపి ఆర్.ఆర్.ఆర్ సినిమాను 65 కోట్లకు డీల్ క్లోజ్ చేశారట. దుబాయ్ కు చెందిన డిస్ట్రిబ్యూషన్ ఫార్స్ ఫిలిమ్స్ వారు ఆర్.ఆర్.ఆర్ సినిమా ఓవర్సీస్ రైట్స్ దక్కించుకున్నారట. ఈవారంలో దానయ్యకు 30 కోట్ల అడ్వాన్స్ ఇస్తున్నారట. బాహుబలి సినిమాతో రాజమౌళి సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు.. మళ్లీ ఆ రికార్డులను తిరగరాసేలా ఆర్.ఆర్.ఆర్ తీస్తున్నాడు జక్కన్న. చరణ్, తారక్ వంటి స్టార్స్ కలిసి నటించడంతో ఈ సినిమాపై తారాస్థాయి అంచనాలు ఏర్పడ్డాయి.