సైరా కోసం ఎడిటర్ గా చిరు

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి అక్టోబర్ 2న రిలీజ్ ఫిక్స్ చేశారు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ సినిమా ఫైనల్ కట్ 3 గంటలు వచ్చిందని తెలుస్తుంది. అయితే చిరు మాత్రం ఇంకాస్త ట్రిమ్ చేయాలని చెప్పాడట.  

అంతేకాదు ఎడిటర్ దగ్గర తను కూడా కూర్చుని ఎడిట్ చేస్తున్నాడని తెలుస్తుంది. సో సైరా కోసం చిరంజీవి ఎడిటర్ గా కూడా మారాడన్నమాట. 250 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమాలో చిరుతో పాటుగా అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, సుదీప్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఈ ఇయర్ రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీగా సైరా సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో లేదో చూడాలి.