అల్లు అర్జున్ కు ఫైన్ వేసిన సైబరాబాద్ పోలీసులు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు సైబరాబాద్ పోలీసులు ఫైన్ వేశారు. అల్లు అర్జున్ వాడుతున్న ఖరీదైన కార్ వ్యాన్ కు సైబరాబాద్ పోలీసులు ఫైన్ వేశారు. ఈమధ్య వార్తల్లో నిలిచిన బన్ని కారు వ్యాన్ ఈరోజు హిమాయత్ నగర్ దగ్గర ట్రాఫిక్ జామ్ కు కారణం అయ్యింది. అంతేకాదు కాదు కార్ వ్యాన్ అద్దాలు బ్లాక్ ఫిల్మ్ తో ఉన్నాయి. అది గమనించిన అబ్దుల్ ఆజం కార్ వ్యాన్ ని ఫోటో తీసి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

సిటిజెన్ నుండి వచ్చిన కంప్లైంట్ పరిగణలో తీసుకున్న సైబరాబాద్ పోలీసులు కార్ వ్యాన్ ను పరిశీలించారు. అది అల్లు అర్జున్ కు చెందిన వాహనంగా గుర్తించారు. నింబంధనలను ఉల్లఘించి ఉండటంతో పోలీసులు అల్లు అర్జున్ కార్ వ్యాన్ కు 735 రూపాయల ఫైన్ విధించారు. సెలబ్రిటీస్ అయినంత మాత్రానా వాళ్లను వదిలిపెట్టేది లేదని పోలీసులు మరోసారి నిరూపించారు. ఈమధ్యనే ఆర్జివి ఇస్మార్ట్ శంకర్ చూసేందుకు బైక్ మీద ట్రిపుల్ రైడ్ లో వెళ్లాడు. కనీసం హెల్మెట్ కూడా లేకపోవడంతో ఆర్జివికి ఫైన్ వేశారు.