
నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రం కె కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా గ్యాంగ్ లీడర్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా కథ విషయానికొస్తే.. ఓ రివెంజ్ స్టోరీ రైటర్ కు ఓ ఐదుగురు ఆడవాళ్లు కలిసి వాళ్లు చేయాలనుకున్న పనిని నానితో చేయాలని అనుకుంటారు. అసలు ఐదుగురు ఆడవాళ్లకు ఆ విలన్ ఏ అన్యాయం చేశాడు. అతన్ని నాని ఎలా ఎదురుకున్నాడు అన్నది సినిమా కథ.
ఈ సినిమా టీజర్ చూసిన తర్వాత కొందరు నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాకు దగ్గరగా ఉందని అంటున్నారు. అందులో కూడా ముగ్గురు చిన్న పిల్లలతో కలిసి నాని విలన్ భరతం పడతాడు. అలానే ఈ సినిమాలో ఐదుగురు ఆడవాళ్లతో కలిసి నాని ఎలా విలన్ ను టార్గెట్ చేశాడన్నది గ్యాంగ్ లీడర్ కథ. ఆ ఐదుగురు ఆడవాళ్లకు లీడర్ గా ఉంటాడు కాబట్టి సినిమాకు గ్యాంగ్ లీడర్ అని టైటిల్ పెట్టారు. విక్రం కె కుమార్ రాసుకున్న కథను ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఆగష్టు 15న రిలీజ్ ఫిక్స్ చేసిన సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి.