నాకు బ్యాక్ గ్రౌండ్ ఉంది : విజయ్ దేవరకొండ

యువ హీరో విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ జూలై 26 శుక్రవారం రిలీజ్ అవుతుంది. భరత్ కమ్మ డైర్క్షన్ లో వస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాపై ఇప్పటికే సూపర్ బజ్ ఏర్పడింది. తెలుగులో తీసినా సరే ఈ మూవీని సౌత్ అన్ని భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇక బుధవారం వైజాగ్ లో డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.   

చిత్రయూనిట్ సమక్షంలో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ స్పీచ్ అందరిని ఆకట్టుకుంది. తన కెరియర్ లో ఈ సినిమా జర్నీ చాలా ఎమోషనల్ గా సాగిందని.. సినిమా మొదలు పెట్టిననాటి నుండి పూర్తయ్యే వరకు చాలా మందిని పోగొట్టుకున్నామని.. పర్సనల్ గా ఈ సినిమా తనకు ఎంతో ఎమోషనల్ గా అనిపించిందని అన్నారు విజయ్. ఇక ఇంటర్వ్యూస్ లో ఎక్కడికి వెళ్లినా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎలా రాణిస్తున్నారని అడుగురున్నారని తనకి బ్యాక్ గ్రౌండ్ లేదని ఎవరన్నారు తనకు మీరంతా వెనుక ఉన్నారని ఈసారి ఎవరైనా అడిగితే తనకి బ్యాక్ గ్రౌండ్ ఉందని చెబుతానని అన్నాడు విజయ్.        

ఇక సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక కూడా తన పర్సనల్ లైఫ్ ను రిస్క్ లో పెట్టి మరి ఈ సినిమా చేసిందని.. డైరక్టర్ భరత్ కమ్మ ఈ సినిమా కోసం 3 ఏళ్లు వెయిట్ చేశాడని. నిర్మాతలు తమకు ఏం కావాలో అది ఇచ్చారని ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరు తమ ఫుల్ ఎఫర్ట్ పెట్టారని అన్నాడు విజయ్.