చిరంజీవి కోసం స్పెషల్ షో

పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కలక్షన్స్ తో దూసుకెళ్తుంది. కొన్నాళ్లుగా తెలుగులో ప్రయోగాత్మక సినిమాలు, మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు వస్తున్నాయి. అందుకే ఆడియెన్స్ కు పక్కా మాస్ మసాలా మూవీ అందించాలనే ఉద్దేశంతో రామ్ ఇస్మార్ట్ శంకర్ వచ్చింది. రిలీజ్ ముందు బి, సి సెంటర్స్ వరకే అనుకున్న ఈ సినిమా ఆఫ్టర్ రిలీజ్ A సెంటర్ లో కూడా కలక్షన్స్ దుమ్ము దులిపేస్తుంది.  

ఇక ఈ సినిమాకు వచ్చిన సూపర్ హిట్ టాక్.. వసూళు చేస్తున్న కలక్షన్స్ అన్ని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే రామ్ కెరియర్ లో హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా ఇస్మార్ట్ శంకర్ నిలిచింది. అందుకే ఇండస్ట్రీ పెద్దగా ఇస్మార్ట్ శంకర్ కు వస్తున్న టాక్ చూసి మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను స్పెషల్ గా చూడాలని ఫిక్స్ అయ్యారట. ఈరోజు చిరు కోసం పూరి అండ్ టీం సినిమా స్పెషల్ ప్రీమియర్ ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తుంది. అసలే హిట్ టాక్ తో దూసుకెళ్తున్న మూవీ ఇక చిరు కూడా సపోర్ట్ చేస్తే ఇంకాస్త కలక్షన్స్ పెరిగే అవకాశం ఉంటుంది.      

ఇంతకుముందు పూరి చిరు కోసం ఆటో జానీ కథ రెడీ చేశాడు. అయితే ఆ కథ ఫస్ట్ హాఫ్ వరకు నచ్చినా సెకండ్ హాఫ్ నచ్చకపోవడంతో పూరి సినిమా క్యాన్సిల్ చేసుకున్నాడు చిరంజీవి. టెంపర్ తర్వాత 3, 4 ఏళ్లుగా హిట్టు కోసం తపిస్తున్న పూరి ఫైనల్ గా ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకున్నాడు.