
యంగ్ రెబల్ స్టార్ ప్రబాస్ బాహుబలి తర్వాత అదే రేంజ్ భారీ బడ్జెట్ తో చేస్తున్న సినిమా సాహో. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ వారు 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమాలో హీరోయిన్ గా శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తుంది. ఆగష్టు 15న రిలీజ్ అనుకున్న ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి కావడం లేదని అదే నెల 30కి వాయిదా వేశారు. ఇప్పటికే సినిమా టీజర్ తో అంచనాలు పెంచగా ఇప్పుడు రోజుకో పోస్టర్ తో సాహో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నారు.
నిన్న ప్రభాస్, శ్రద్ధా కపూర్ ల రొమాన్స్ పోస్టర్ వదిలిన చిత్రయూనిట్ ఈరోజు స్పెషల్ గా ఓ యాక్షన్ సీన్ పోస్టర్ వదిలారు. ప్రభాస్, శ్రద్ధా కపూర్ ఇద్దరు ఫిస్టల్ తో విలన్లను ఎటాక్ చేస్తున్న పోస్టర్ వదిలారు. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ పోస్టర్ సూపర్ గా నచ్చేసింది. అందుకే పోస్టర్ ఇలా వచ్చిందో లేదో అలా సోషల్ మీడియాలో వైరల్ చేశారు. తప్పకుండా సాహోతో ప్రభాస్ మరో సంచలనం సృష్టించడం ఖాయమని నమ్ముతున్నారు.