
కింగ్ నాగార్జున హీరోగా రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో సూపర్ హిట్ మూవీ మన్మథుడు సీక్వల్ గా వస్తున్న సినిమా మన్మథుడు 2. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. కీర్తి సురేష్, సమంత వంటి క్రేజీ హీరోయిన్స్ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నారు. ఆగష్టు 9న రిలీజ్ ఫిక్స్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేశారు.
ట్రైలర్ చూస్తే ఫన్ అండ్ ఎమోషనల్ జర్నీగా అనిపించింది. ముఖ్యంగా డైరక్టర్ రాహుల్ తన మొదటి సినిమాలానే డైలాగ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. ఏజ్ బార్ హీరోని ప్రేమించిన హీరోయిన్.. తన ఏజ్ కనిపించకుండా జాగ్రత్తపడే హీరో ఇలా ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ గా మన్మథుడు 2 రాబోతుంది. విజయభాస్కర్ డైరక్షన్ లో వచ్చిన మన్మథుడు ఆడియెన్స్ ను విపరీతంగా అలరించగా ఈ సీక్వల్ మన్మథుడు ఎలాంటి హంగామా సృష్టిస్తాడో చూడాలి.