రవి, లాస్య బిగ్ బాస్ కు నో..!

బుల్లితెర మీద యాంకర్స్ గా సూపర్ హిట్ పెయిర్ అనిపించుకున్నారు రవి, లాస్య. సంథింగ్ సంథింగ్ ప్రోగ్రాం నుండి ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనుకునే దాకా షో చేశారు. అయితే రూమర్స్ మరి ఎక్కువవడం వల్ల వాళ్లిద్దరి విడివిడిగా  షోలు చేస్తున్నారు. ఇక పెళ్లి తర్వాత లాస్య పూర్తిగా యాంకరింగ్ కు దూరమయ్యింది. బిగ్ బాస్ సీజన్ 3 కోసం యాంకర్ రవి, లాస్యలను అడిగారట. రవి, లాస్య ఉంటే షో ఇంకా సక్సెస్ అవుతుందని భావించారట.   

రవి బిగ్ బాస్ కు ఓకే చెప్పాడట.. లాస్య మాత్రం రవి వల్లే బిగ్ బాస్ షోకి నో చెప్పిందట. రవిని కూడా బిగ్ బాస్ కంటెస్టంట్ గా తీసుకుంటున్నామని బిగ్ బాస్ నిర్వాహకులు చెప్పగా లాస్య వెనక్కి తగ్గిందట. అదీగాక తన నెలల పాపని చూసుకోవాలని చెప్పిందట. రవి వస్తాడని లాస్య బిగ్ బాస్ కు నో చెప్పింది మరి రవి ఎందుకు నో చెప్పాడో తెలియాల్సి ఉంది. ఆల్రెడీ పటాస్ షోకి బ్రేక్ ఇచ్చి శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఒకవేళ ఇద్దరు వస్తే పటాస్ షో ఎలా అనుకున్నారో ఏమో అందుకే రవి డ్రాప్ అవ్వాల్సి వచ్చింది.