నాని 'గ్యాంగ్ లీడర్' టీజర్

నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రం కె కుమార్ డైరక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా గ్యాంగ్ లీడర్. ఆగష్టు 15న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా టీజర్ ఈరోజు రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రివెంజ్ రైటర్ అయిన హీరోకి అనుకోకుండా పరిచయమైన ఓ ఐదుగురు ఆడవాళ్ల మధ్య నడిచే కథే గ్యాంగ్ లీడర్ సినిమా. టీజర్ ఇంప్రెసివ్ గా అనిపించింది. ఆడియెన్స్ కు మరోసారి పక్కా ఎంటర్టైనింగ్ ఇవ్వడం ఖాయమని చెప్పొచ్చు. 

నాని సరసన ప్రియాంకా అరుల్ మోహన్ నటిస్తుండగా సీనియర్ నటి లక్ష్మి, శరణ్య కూడా నటిస్తున్నారు. తెలుగులో హలో సినిమా తర్వాత విక్రం కుమార్ డైరెక్ట్ చేస్తున్న సినిమా గ్యాంగ్ లీడర్. రీసెంట్ గా జెర్సీ సినిమాతో హిట్ అందుకున్న నాని ఈ సినిమాతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. సినిమాలో విలన్ గా కార్తికేయ నటించడం విశేషం. ఆర్కెస్ 100 సినిమాతో హీరోగా సక్సెస్ అందుకున్న కార్తికేయ సినిమాలో విలన్ గా చేయడం కూడా ప్రత్యేక అంశమని చెప్పుకోవచ్చు. మరి నాని గ్యాంగ్ లీడర్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.