మహర్షిని మెచ్చిన మాజి క్రికెటర్

సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమాగా వంశీ పైడిపల్లి డైరక్షన్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా మహర్షి. మహేష్ కెరియర్ లోనే హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచిన ఈ సినిమా చాలా చోట్ల నాన్ బాహుబలి రికార్డులను క్రియెట్ చేసింది. మే 9న రిలీజైన ఈ సినిమా గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే రీసెంట్ గా ఈ సినిమా చూసిన మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ సినిమా సూపర్ అంటూ ట్వీట్ చేశాడు.

మహర్షి సినిమా చూశాను.. చాలా బాగా నచ్చింది.. మన అందరికి అవసరమైన ఎంతో బలమైన.. స్పూర్తిదాయమైన సందేశాన్ని ఇచ్చారు. మహేష్ నుండి మరో పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ వచ్చింది అంటూ వివిఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేయడం విశేషం. సినిమా కమర్షియల్ గానే కాదు ఇలా చూసిన ప్రతి ఒక్కరి మనసులను గెలిచేస్తుంది. కమర్షియల్ గా కొన్ని సినిమాలే సక్సెస్ అవుతాయి కాని సినిమా చూసి స్పందించాల్సిన అవసరం కలిగించే సినిమాలు కొన్నే ఉంటాయి. మహేష్ మహర్షి అందులో ఒకటి.