RRR లో ఆమె ఫిక్స్

రాజమౌళి తెరకెక్కిస్తున్న క్రేజీ మూవీ ఆర్.ఆర్.ఆర్ లో ఒక హీరోయిన్ గా అలియా భట్ ఓకే అవగా రెండో హీరోయిన్ గా నిత్యా మీనన్, సాయి పల్లవి వంటి స్టార్స్ నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. కాని ఇప్పుడు ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా హాలీవుడ్ ముద్దుగుమ్మ ఎమ్మా రాబర్ట్స్ ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. అమెరికాలో నటి అయిన ఎమ్మా రాబర్ట్స్ ఆర్.ఆర్.ఆర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

తను రాసుకున్న పాత్రకు పర్ఫెక్ట్ కాస్టింగ్ ఎంచుకునే జక్కన్న ఒక హీరోయిన్ గా అలియా భట్ ను ఫైనల్ చేశాడు. రెండో హీరోయిన్ గా ముందు డైసీ ఎడ్గర్ జోన్స్ ను ఎంచుకోగా ఆమె డేట్స్ అడ్జెస్ట్ చేయలేక సినిమా నుండి తప్పుకుంది. ఫైనల్ గా ఆ ఛాన్స్ ఎమ్మా రాబర్ట్స్ కు దక్కింది. ఎన్.టి.ఆర్, రాం చరణ్ నటిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీగా ఆర్.ఆర్.ఆర్ వస్తుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.