చైతు, అఖిల్.. దూరం దూరం..!

అక్కినేని అన్నదమ్ములు నాగ చైతన్య, అఖిల్ ఇద్దరు దూరం దూరంగా ఉంటున్నారా.. ప్రస్తుతం అన్నదమ్ముల మధ్య మాటల్లేవా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. మూడు సినిమాలు చేసినా అఖిల్ ఇంతవరకు సక్సెస్ అవ్వలేదు. చైతు మాత్రం ఒక హిట్టు రెండు ఫ్లాపులు అన్నట్టుగా కెరియర్ కొనసాగిస్తున్నాడు. అయితే ఈమధ్య అన్నదమ్ముల మధ్య ఏదో విషయం దగ్గర గొడవ అయ్యిందని అంటున్నారు.  

ప్రతి ఆదివారం కుటుంబమంతా కలుసుకునే ప్రోగ్రాం ఉంటుంది. అయితే దానికి అందరు పాల్గొనాల్సి ఉంది. కాని చైతు, సమంతల వల్ల ఆ మీటింగ్ క్యాన్సిల్ అవుతుందని తెలుస్తుంది. ఒకసారి ఒకరు అటెండ్ అయితే మరోసారి మరొకరు అటెండ్ అవుతున్నారట. ఇద్దరి వ్యవహార శైలితో కింగ్ నాగార్జునకు ఇబ్బందిగా మారిందని తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అన్నది తెలియాలంటే ఇద్దరు కలిసి ఒకే ఈవెంట్ లో పాల్గొనాల్సిందే.