మహేష్ తో కొరటాల శివ

మహర్షి తర్వాత సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపుడి డైరక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు అంటూ ఓ క్రేజీ మూవీతో మహేష్ వస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అసలైతే త్రివిక్రం, సందీప్ వంగ డైరక్టర్స్ లైన్ లో ఉండగా మెగా నిర్మాత అల్లు అరవింద్ తో మహేష్ సినిమా చర్చల్లో ఉంది. పరశురాం డైరక్షన్ లో అల్లు అరవింద్ మహేష్ సినిమా ఉంటుదని అన్నారు. కాని పరశురాం ప్లేస్ లో కొరటాల శివ వచ్చిన చేరినట్టు తెలుస్తుంది.

ఆల్రెడీ కొరటాల శివ డైరక్షన్ లో శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు చేశాడు మహేష్. ఆ రెండు సినిమాలు మహేష్ కెరియర్ లో సూపర్ హిట్లుగా నిలిచాయి. ప్రస్తుతం కొరటాల శివ చిరంజీవి సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత చరణ్ తో సినిమా అన్నారు కాని మహేష్ బాబు సినిమా లైన్ లో ఉందని తెలుస్తుంది. అల్లు అరవింద్ నిర్మాణంలో కొరటాల శివ, మహేష్ సినిమా ఉంటుందని టాక్. అదే నిజమైతే మహేష్ ఫ్యాన్స్ కు పండుగ అన్నట్టే.