చిరు ఓకే అంటే ఐదేరోజుల్లో కథ రెడీ

టాలీవుడ్ క్రేజీ డైరక్టర్ పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ ఫాంలోకి వచ్చినట్టే అనిపిస్తుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ పూరి మార్క్ పక్కా మాస్ మసాలా మూవీగా హిట్ టాక్ తెచ్చుకుంది. పూరి టేకింగ్, రామ్ యాక్టింగ్ తో పాటుగా హీరోయిన్స్ అందాలు కూడా సినిమాకు ప్లస్ అయ్యాయి. టెంపర్ తర్వాత ఇన్నాళ్లకు హిట్ కొట్టిన పూరి సూపర్ జోష్ లో ఉన్నాడు.   

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమాపై స్పందించాడు పూరి. మెగాస్టార్ 150వ సినిమాకే పూరి మూవీ చేయాల్సి ఉంది. ఆటోజానీ కథ చెప్పినా మెసేజ్ ఉన్న సినిమా చేయాలని కత్తి రీమేక్ చేశారు. అయితే చిరు కోసం రాసుకున్న ఆ కథ నచ్చలేదు కాబట్టి చిరు ఛాన్స్ ఇస్తే ఐదురోజుల్లో తన కోసం ఓ కథ సిద్ధం చేస్తానని అన్నాడు పూరి. ఐదురోజుల్లో కథ మరో ఐదురోజుల్లో డైలాగ్ వర్షం మొత్తం 10 రోజుల్లో చిరు స్క్రిప్ట్ సిద్ధం చేస్తానని అన్నాడు పూరి.