సమంత ఓ బేబీ రికార్డ్ కలక్షన్స్

అక్కినేని కోడలిగా మారాక కూడా సమంత వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఇన్నాళ్లు కమర్షియల్ సినిమాలను చేసిన సమంత ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చేస్తుంది. యూటర్న్, మజిలీ తర్వాత రీసెంట్ గా ఓ బేబీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది సమంత. ఈ సినిమాలో సమంత నటనకు అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొరియన్ మూవీ మిస్ గ్రానీ రీమేక్ గా వచ్చిన ఓ బేబీ సినిమా సమంత కెరియర్ లో హయ్యెస్ట్ కలక్షన్స్ రాబట్టింది.

సమంత సోలోగా నటించిన ఓ బేబీ సినిమా జూలై 5న రిలీజ్ అవగా ఇప్పటికి 38 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నందిని రెడ్డి డైరక్షన్ లో వచ్చిన ఓ బేబీ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సురేష్ బాబు నిర్మించారు. సమంత ఓ బేబీ ఇప్పటికి మంచి కలక్షన్స్ తో దూసుకెళ్తున్నాడు. ఏపి తెలంగాణాలో ఇప్పటివరకు 27 కోట్లు వసూళు చేయగా అమెరికాలో 6.7 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఫుల్ రన్ లో ఓ బేబీ 50 కోట్ల మార్క్ దాటి రికార్డ్ సృష్టించేలా ఉంది.