యాత్ర డైరక్టర్ భారీ బడ్జెట్ మూవీ

కళాశాల, ఆనందో బ్రహ్మ సినిమాలతో అలరించిన డైరక్టర్ మహి వి రాఘవ్ ఈ ఇయర్ వైఎస్సార్ బయోపిక్ గా చేసిన యాత్ర సినిమా సూపర్ హిట్ అయ్యింది. వైఎస్ జీవితంలో పాదయాత్ర నేపథ్యంతో ఈ సినిమా కథ రాసుకున్నాడు మహి వి రాఘవ్. ఇక ఆ సినిమా తర్వాత జగన్ సిఎం అవగానే యాత్ర 2 మొదలు పెడతానని ఎనౌన్స్ చేశాడు మహి వి రాఘవ్. అయితే ఇప్పుడు ఆ సినిమాకు బ్రేక్ ఇచ్చి ఓ భారీ బడ్జెట్ మూవీ చేయబోతున్నట్టు తెలుస్తుంది.

పివిపి బ్యానర్ లో మహి వి రాఘవ్ డైరక్షన్ లో పాన్ ఇండియా సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనల్ కాగా త్వరలో ఈ సినిమా అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందట. ఇంతకీ ఈ సినిమాలో హీరో ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్సే అంటున్నారు. మహి టాలెంట్ చూసి స్టార్స్ కూడా అతనితో సినిమా చేసేందుకు సై అంటారు కాని స్టార్ హీరోలు వరుస సినిమాలు లైన్ లో పెట్టుకున్నారు. మరి మహితో చేసే ఆ హీరో ఎవరో చూడాలి.