
కమల్ హాసన్ హీరోగా శంకర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఇండియన్ 2. పాతికేళ్ల తర్వాత ఈ సినిమా సీక్వల్ కు రెడీ అవుతుంది. షూటింగ్ మొదలు పెట్టి చాలారోజులవుతున్నా మధ్యలో కమల్ రాజకీయ తెరంగేట్రంతో సినిమాకు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. అంతేకాదు నిర్మాతలకు శంకర్ కు మధ్య డిస్కషన్స్ కూడా సినిమా షూటింగ్ కు అంతరాయం కలిగించాయి. అయితే ఇప్పుడు ఇండియన్ 2 టీం వాటినన్నిటిని దాటి షూటింగ్ కు వెళ్తుందట.
కమల్ కూడా షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేశారు. షూటింగ్ లేటవుతున్న కారణం చేత కాజల్ ఆ సినిమా నుండి బయటకు వచ్చింది. ఇప్పుడు ఆమె ప్లేస్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఇండియన్ 2లో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తుంది. ప్రస్తుతం కెరియర్ అటు ఇటుగా ఉన్న రకుల్ కు ఇండియన్ 2లో ఛాన్స్ రావడం నిజంగా లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు.