బిగ్ బాస్ సీజన్ 3 మొదలైంది..!

కొన్నాళ్లుగా వివాదాలను మూటకట్టుకున్న బిగ్ బాస్ సీజన్ 3 మొదలవుతుందా కాదా అన్న కన్ ఫ్యూజన్ ఏర్పడింది. అయితే ఆదివారం చెప్పిన టైం కే బిగ్ బాస్ షో స్టార్ట్ అయ్యింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న ఈ షోలో 15 మంది కంటెస్టంత్స్ పాల్గొన్నారు. మొదట వి6 తీన్మార్ సావిత్రి అలియాస్ శివజ్యోతి మొదటి కంటెస్టంట్ గా ఎంట్రీ ఇవ్వగా ఆ తర్వాత సీరియల్ యాక్టర్ రవికృష్ణ ఎంట్రీ ఇచ్చాడు. 

ఈ సీజన్ అంతా బుల్లితెర సెలబ్రిటీస్ మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. స్టార్ సెలబ్రిటీస్ గా హేమ, శ్రీముఖి, టివి9 జాఫర్, సింగర్ రాహుల్, రవికృష్ణ ఉన్నారు ఇక మరో సర్ ప్రైజ్ ఏంటంటే ఈ సీజన్ కు స్టార్ కపుల్ గా వరుణ్ సందేశ్ అతని భార్య వితిక కూడా హౌజ్ లో ఎంట్రీ ఇచ్చారు. మరి వీరిద్దరి ఎంట్రీ వెనుక ఉన్న కారణం ఏంటన్నది మాత్రం తెలియలేదు.      


బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు కంటెస్టంట్స్ లిస్ట్ :

(సావిత్రి) శివ జ్యోతి   

రవి కృష్ణ

అషు రెడ్డి   

జాఫర్ బాబు 

హిమజ   

రాహుల్ (సింగర్)  

రోహిణి 

బాబా భాస్కర్ (డ్యాన్స్ మాస్టర్) 

పునర్నవి    

హేమ    

అలి రాజా   

మహేష్ విట్ట      

శ్రీముఖి 

వరుణ్ సందేష్  

వితిక